తెలంగాణలో భారీ పెట్టుబడి…

79
- Advertisement -

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ నగరంలోకి మైక్రోచిప్‌ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కొల్‌కత్తా, న్యూఢిల్లీ కాదని అమెరికాకు చెందిన మైక్రోచిప్ కంపెనీ అభివృద్ధి కేంద్రంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కావాల్సిన భూమిని కోకాపేటలో 168,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని వన్ గోల్డెన్ మైల్‌లో కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్‌కంపెనీలు లేఆఫ్‌లు మరియు కొత్త ఉద్యోగ భర్తీకి సంబంధించి ఫ్రీజ్‌లను ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణను కొనసాగించనుంది. ఇందుకు కోసం రాబోయే 10సంవత్సరాల పాటు వారి వృద్ధి ప్రణాళికలను కంపెనీ అంచనా వేసింది.

ఈ సందర్భంగా మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సెట్టికెరె మాట్లాడుతూ…. ఇటీవలి కాలంలో మైక్రోచిప్ ఉత్పత్తి గణనీయమైన మరియు స్థిరమైన వృద్ధిని కొనసాగుతుంది. ఇందుకు గాను భారతదేశం ఎంతగానో కృషి చేసింది. తద్వారా భారతదేశంలో మైక్రోచిప్ సామర్ధ్యాలను విస్తరించడానికి ఇది మరొక కీలక ముందడుగు అని ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలను అందిస్తుందన్నారు.

వన్‌గోల్డెన్ మైల్‌ అనేది సువీశాలమైన 500000చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇందులో బోటిక్ ఆఫీస్‌ స్పేస్‌లు క్యూరేటెడ్‌ హై-స్ట్రీట్ రిటైల్‌తో కూడిన ఆరియన్ పాదముద్రతో డిజైన్‌ చేయబడిన ఎస్కార్‌ మరియు టెర్మినస్ సహ-ప్రమోట్‌ చేసిన కమర్షియల్ ప్రాపర్టీ అని సుస్థిరతను ప్రోత్సహించడానికి యూఎస్జీబీసీ తో లీడ్‌ గోల్డ్‌రేటెడ్‌ భవనంగా ప్రాజెక్ట్‌ ప్రీ సర్టిఫై చేశామని వన్‌గోల్డెన్ మైల్ మేనేజింగ్ డైరెక్టర్ పుష్కిన్ రెడ్డి రిత్విక్ మాలి అన్నారు.

సెమీ కండక్టర్ పరిశ్రమల ఆవిష్కరణలో హైదరాబాద్‌ ముందంజలో ఉన్నట్టు మైక్రోచిప్ పెట్టుబడి సెమీ కండక్టర్‌ సంస్థలకు ప్రాధాన్య ఎంపిక కల నగరం అని కుష్‌మన్‌ మరియు వేక్‌ఫీల్డ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ వీరబాబు అన్నారు.

2021లో వన్వేస్ట్‌ సంస్థలో 750000చదరపు అడుగుల ఆఫీస్‌ కార్యాలయంను లీజుకు ఇచ్చినట్టు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో హైదరాబాద్‌లాంటి నగరంకు కమర్షియల్ ఆఫీస్ విభాగానికి సానుకూల దృక్పథాన్ని సూచిస్తుందని కార్యాలయ స్థలాలకు డిజైన్ చేయబడిందని వన్‌గోల్డెన్ మైల్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచం హైదరాబాద్‌ నగరం వైపు చూస్తుందడానికి ఇదొక నిదర్శనం.

ఇవి కూడా చదవండి…

ప్రజలు కోరిన చోట శిబిరాలు:హరీశ్‌

కంటివెలుగు దేశవ్యాప్తంగా విస్తరణ..

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ టాప్‌..

- Advertisement -