Trump:మరో ఐదు దేశాలపై నిషేధం

5
- Advertisement -

అమెరికా ప్రభుత్వం తన ట్రావెల్ బ్యాన్‌ను మరింత విస్తరించింది. ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధాలకు తోడు మరో ఐదు దేశాలను జాబితాలో చేర్చడంతో, ప్రస్తుతం మొత్తం 39 దేశాలపై ప్రవేశ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం అమెరికా సరిహద్దుల్లో భద్రత, ఇమిగ్రేషన్ నియంత్రణలను మరింత కఠినతరం చేసే దిశగా తీసుకున్న చర్యగా వైట్ హౌస్ తెలిపింది.

తాజాగా బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా దేశాలను చేర్చారు.అలాగూ పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలపై ప్రయాణించే వారికి కూడా పూర్తిస్థాయి ప్రవేశ నిషేధం విధించారు. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, ఐవరీ కోస్ట్, డొమినికా, గేబాన్, గాంబియా, మలావి, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే.ఈ తాజా చర్యలు అమెరికాలోకి ప్రవేశించే వారికి మరింత కఠిన భద్రతా తనిఖీలు అమలు చేయడానికే తీసుకున్నామని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

ఇంతకుముందు జూన్‌లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల పౌరులపై పూర్తిస్థాయి నిషేధం విధించగా, మరో 7 దేశాలపై కఠిన ఆంక్షలు పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైటి, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్.

పాక్షిక ఆంక్షలు ఉన్న దేశాలు:
బురుండీ, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, టర్క్‌మెనిస్తాన్, వెనిజువెలా.

Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

- Advertisement -