యుఎస్‌లో వరుసగా రెండోరోజు లక్ష కరోనా కేసులు..

204
coroma us
- Advertisement -

ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల హీట్ మరోవైపు రోజుకు లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో యుఎస్‌లో వాతావరణం హీటెక్కింది. నవంబర్ 4న అమెరికాలో ఒక్కరోజులో 99,960 కొత్త కేసులు నమోదు కాగా నవంబర్ 5న రికార్డ్ స్థాయిలో 1,03,087 కేసులు నమోదయ్యాయి.

యుఎస్‌లో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. నవంబర్ 20 నుంచి అమెరికాలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికా ఆరోగ్యపరంగా ఏ మాత్రం సురక్షితంగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక అమెరికాలో ఇప్పటివరకు 9,919,522 కేసులు నమోదు కాగా 2,40,953 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, స్పెయిన్, మెక్సికోలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

- Advertisement -