భారత్ అమెరికా మధ్య అతిపెద్ద డీల్ జరిగింది. భారత్ కు జావెలిన్ క్షిపణులు సహా పలు ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఢీల్ విలువ 93 మిలియన్ డాలర్లు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది డిఫెన్స్ సెక్యూరిటీ కో ఆపరేషన్ ఏజెన్సీ.
ఈ ప్యాకేజీలో 100 FGM-148 జావెలిన్ క్షిపణులు, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, మరియు 216 ఎక్స్‌కాలిబర్ ఫిరంగి గుండ్లు ఉన్నాయి. ప్రతిపాదిత బదిలీల గురించి డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ DSCA అమెరికన్ కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేసింది DSCA విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారతదేశం అభ్యర్థించిన వాటిలో లైఫ్‌సైకిల్ సపోర్ట్, భద్రతా తనిఖీలు, ఆపరేటర్ శిక్షణ, లాంచ్ యూనిట్లకు పునరుద్ధరణ సేవలు మరియు పూర్తి కార్యాచరణ సామర్థ్యానికి అవసరమైన ఇతర సంబంధిత అంశాలు కూడా ఉన్నాయి.
ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మరియు ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడంలో భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతుందని DSCA పేర్కొంది.
Also Read:TG:వాట్సాప్ ద్వారా ‘మీ సేవా’

