హెచ్1బీ వీసాదారులకు అమెరికా గుడ్‌ న్యూస్‌..

92
- Advertisement -

హెచ్1బీ వీసాదారులకు అగ్రదేశం అమెరికా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు, గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్నవారికి వర్క పర్మీట్‌ను పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. వీరికి మరో ఏడాదిన్నర పాటు వర్క్ పర్మిట్ ను పెంచుతూ అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఇవాళ ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులు లాభపడనున్నారు. మే 4వ తేదీ నుంచే విదేశీ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తించనుంది. ఇప్పటిదాకా ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ కార్డ్ (ఈఏడీ)పై ఉన్న 180 రోజుల అదనపు గడువు.. ఆటోమేటిక్ గా 540 రోజులకు పెరుగుతుందని పేర్కొంది.

అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఈఏడీ అభ్యర్థనల పరిష్కారం కోసం పనిచేస్తోంది. అయితే, ఉద్యోగ అనుమతి గడువుపై ఇప్పుడున్న 180 రోజుల పొడిగింపు గడువు సరిపోదని భావించింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల వర్క్ పర్మిట్ కు సంబంధించి పొడిగింపు గడువును పెంచాలని నిర్ణయించింది. దాని వల్ల ఉద్యోగుల కుటుంబాలు, సంస్థలకు మేలు కలగనుంది అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం. జడ్డౌ తెలిపారు.

- Advertisement -