- Advertisement -
8 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెబుతూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్. 2016లో మోసిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది ఉర్మిళ. ఆమె వయసు 50 ఏళ్లు కాగా… అతని వయసు 40 ఏళ్లే. అప్పట్లో వీరి వివాహం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నాలుగు నెలల క్రితం విడాకుల కావాలంటూ కోర్టుకు వెళ్లినట్టు ముంబై వర్గాలు తెలిపాయి. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని, భర్త నుంచి తనకు విడాకులు కావాలని ఆవిడ కోర్టుకు వెళ్లినట్టు తెలిసింది.
2104లో వీరిద్దరికి పరిచయం కాగా ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. రెండేళ్ల ప్రేమ తర్వాత అమృత్ సర్ స్వర్ణ దేవాలయం బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
Also Read:35 లక్షల పెళ్లిళ్లు..రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు!
- Advertisement -