మూత్రం లీక్ అవుతోందా.. !

15
- Advertisement -

కొందరిలో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తెలియకుండానే యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది దీనిని తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇదొక ఆరోగ్య సమస్య దీనిని తేలికగా తీసుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మగవారితో పోల్చితే ఆడవారిలోనే ఈ యూరిన్ లీక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మూత్రాశయం యొక్క కండరాలు బలహీన పడినప్పుడు మన ప్రమేయం లేకుండానే యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. కొందరిలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాత్రమే కాకుండా కొందరికీ పరిగెత్తే సమయంలో కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. .

అంతే కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈయొక్క యూరిన్ లీకేజ్ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ముఖ్యంగా మహిళల్లో అధికబరువు యూరిన్ లీకేజ్ ను ప్రేరేపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బరువు తగ్గే విధంగా ప్రయత్నించాలి. అలాగే కటి వలయపు కండరాలను బలోపేతం చేసే వ్యాయామలును నిపుణుల పర్యవేక్షణలో చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకా కూల్ డ్రింక్, టీ, కాఫీ వంటి ద్రవరూప పానీయాలను తగ్గించాలి. ఇంకా తీపి, పులుపు వంటి వాటికి సాధ్యమైనంత వరకు దూరం పాటించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా యూరిన్ లీకేజ్ సమస్యను అధిగమించవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమస్యను వైద్యులతో చర్చించేందుకు ఏ మాత్రం సిగ్గు పడకూడదు. మీ యొక్క సమస్యను స్పష్టంగా వైద్యులకు తెలిపి తగు మెడిసిన్ తీసుకుంటే త్వరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:అల్లం టీ తో ప్రయోజనాలు..

- Advertisement -