- Advertisement -
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించాల్సి వున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం మే 31వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎగ్జామ్‌ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ను ఎప్పుడు నిర్వహిస్తామనేది మే 20వ తేదీన ప్రకటిస్తామని యూపీఎస్సీ అధికారులు వెల్లడించారు.
కాగా, యూపీఎస్సీ చైర్మన్ అరవింద్ సక్సేనా నేతృత్వంలో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం సాధ్యం కాదని భావించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
- Advertisement -