యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల‌..

266
UPPSC
- Advertisement -

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. కొత్త తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inలో చూడవచ్చు. కాగా 2020 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 4న జరగనుంది. యూపీఎస్సీ సీసీఎస్సీ ప్రధాన పరీక్ష వచ్చే ఏడాది జనవరి 8న జరగనుంది. అదేవిధంగా సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌)-2019 పరీక్షకు సంబంధించిన ఫిజికల్‌ టెస్ట్‌లు జూన్‌ 20 నుంచి జరగనున్నాయి.

పరీక్షల కొత్త తేదీలు..

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష (1)- సెప్టెంబర్‌ 6న
కంబైండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌- అక్టోబర్‌ 22న
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌- డిసెంబర్‌ 20న
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- 2021, ఫిబ్రవరి 28న
ఐఈఎస్‌ లేదా ఐఎస్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌- అక్టోబర్‌ 16న
ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామ్‌- ఆగస్టు 9న
కంబైండ్‌ జీయో సైంటిస్ట్‌ (మెయిన్‌) ఎగ్జామ్‌- ఆగస్టు 8న జరగనున్నాయి.

దేశంలో కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా పడింది.

- Advertisement -