ఇంటికి ఒక జమ్మి చెట్టు – ఊరుకు ఒక జమ్మిచెట్టు అనే నినాదంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని పలు దేవాలయాలలో జమ్మి మొక్కలు నాటారు ఉప్పల శ్రీనివాస్ గుప్త.
కామారెడ్డి పట్టణంలోని కల్కి భగవాన్ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జమ్మి మొక్కలు నాటారు. ఇంతకు ముందు సంవత్సరంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో దాదాపు అన్ని దేవాలయాలలో 1100 జమ్మి మొక్కలను నాటడం జరిగింది.ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని దేవాలయాలలో మళ్లీ 1100 జమ్మి చెట్లు నాటడం జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విశ్వనాథ మహేష్ గుప్త యాద నాగేశ్వరరావు, శ్రీకాంత్ ఇంటర్నేషనల్ పొలిటికల్ కమిటీ చైర్మన్ బచ్చు శ్రీనివాస్, భాస్కర్, చీల ప్రభాకర్, గందే శ్రీనివాస్,గోనే శ్రీనివాస్, యాద అంజయ్య, కూర శ్రీనివాస్, శ్రీకాంత్, స్థానిక ఆర్యవైశ్య నాయకులు, దేవాలయాల ట్రస్ట్ సభ్యులు, దేవాలయల చైర్మన్లు, సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.