ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా 3.o ఛాలెంజ్‌ను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త స్వీకరించడం జరిగింది.
ఈ క్రమంలో నాగోల్‌లోని ఆయన నివాసం వద్ద భార్య ఉప్పల స్వప్నతో కలిసి మూడు మొక్కలను నాటారు. అనంతరం ఐవీఎఫ్ ఆలిండియా ప్రెసిడెంట్ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇండియా శ్రీ అశోక్ అగర్వాల్‌కి ఈ ఛాలెంజ్‌ను విసరడం జరిగింది.. ఆయన కూడా మూడు మొక్కలను నాటాలని అలాగే మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ప్రస్తుత పొల్యూషన్ వల్ల మానవాళి మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని, రేపటి తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది పర్యావరణమే అన్నారు. తెలంగాణ నవ అశోకుడు జోగినపల్లి సంతోషన్న పిలుపుమేరకు ఈ ఛాలెంజ్ లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు.
అలాగే పెద్దలు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇండియా అశోక్ అగర్వాల్ కూడా తన ఛాలెంజ్‌ను సమీకరించాలని కోరారు. ప్రతీ ఒక్కరూ విధిగా మూడు మొక్కలు నాటి మనల్ని మనం రక్షించుకునే యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని ఉప్పల శ్రీనివాస్ ఆకాంక్షించారు.