తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వంగా కలిసి రాణీ రుద్రమదేవి చిత్ర పటాన్ని , ఏక బిల్వం మొక్కను అందజేసిన ఐవీఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త.
నాడు కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులతో సస్యశ్యామలంగా పచ్చని పైరుపంటలతో తులతూగిన తెలంగాణ నేడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో కాలువలు, చెరువులు, రిజర్వాయర్లతో పచ్చని పంట పొలాలతో బంగారు తెలంగాణ గా రూపు దిద్దుకున్నందుకు చిహ్నంగా రుద్రమ దేవి చిత్రపటాన్ని, అభిషేక ప్రియుడు శివుడికి ప్రీతి పదమైన ఏకబి ల్వాన్ని కేసీఆర్ కు అందజేసినట్లు తెలిపారు ఉప్పల శ్రీనివాస్ గుప్త.
ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో ఉప్పల ఫౌండేషన్, ఐవీఫ్ ద్వారా అందించిన సేవలను గుర్తు చేస్తూ ఉప్పల శ్రీనివాస్ ను అభినందించిన కేసీఆర్.పార్లమెంట్ స్పీకర్,కేంద్రమంత్రి నాయిక్ ఉప్పలను అభినందించిన తీరును కొనియాడిన సీఎం కేసీఆర్.ఉప్పల శ్రీనివాస్ గుప్త కుమారులు సాయి కిరణ్,సాయి తేజ కూడ కేసీఆర్ ను కలిసి దీవెనలు తీసుకున్నారు