టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలు 56వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు లాక్ డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ఆర్కెస్ట్రా కళాకారులకు బిర్యానీ ప్యాకెట్లు, మాస్కులు, బత్తాయి పండ్లు అందజేశారు.
అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలతోపాటు నాగోల్ లోని ఆయన నివాసం వద్ద డ్రైవర్లు, క్లీనర్లకు,పారిశుద్ధ్య కార్మికులకు,జీహెచ్ఎంసీ సిబ్బంది,పోలీస్ సిబ్బంది, వలస కార్మికులకు, కార్మికులకు, నిరుపేదలకు, ఆటో డ్రైవర్లకు మొత్తం 2 వేల మందికి బిర్యానీ ప్యాకెట్లు, మాస్కులు పంచారు.
అదేవిధంగా వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్‌కు,నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్‌కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు భోజనాలు,మాస్కులు,బత్తాయి పండ్లు అందించారు. ఇవేకాక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఐవీఎఫ్ నాయకులు అన్నదానం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో ఐవీఎఫ్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు.