TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

5
- Advertisement -

తిరుమలలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల లడ్డూ విక్రయ కేంద్రాల వద్దనే UPI పేమెంట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. నగదు చెల్లింపుల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు, సమయం వృథా కావడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా కొన్ని లడ్డూ కౌంటర్లలో మాత్రమే ఈ సదుపాయాన్ని అమలు చేయనున్నారు. భక్తుల నుంచి వచ్చే స్పందన, లావాదేవీల సౌలభ్యం, సాంకేతిక సమస్యలు లేకుండా అమలు అవుతుందా అనే అంశాలను పరిశీలించిన అనంతరం, ఈ విధానాన్ని అన్ని లడ్డూ కౌంటర్లకు విస్తరించే యోచనలో టీటీడీ ఉంది.

ప్రస్తుతం కియోస్క్ యంత్రాల వద్ద లడ్డూ టోకెన్ల కోసం భారీ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా పండుగలు, వీకెండ్లు, సెలవుల సమయంలో భక్తులు ఎక్కువసేపు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు, లడ్డూ కౌంటర్ల వద్దనే నేరుగా UPI ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పించడం వల్ల రద్దీ గణనీయంగా తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది. దీని ద్వారా భక్తులకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Also Read:రెండేళ్లలో రేవంత్ చేసింది శూన్యం:కేటీఆర్

- Advertisement -