UPI:యూపీఐ రోజువారీ పరిమితి పెంపు!

6
- Advertisement -

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీ పరిమితులపై కీలక మార్పులను ప్రకటించింది. ఇవి సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు ఎక్కువ పరిమితిలో లావాదేవీలను చేసుకోవచ్చు.

P2M (పర్సన్-టు-మెర్చంట్) ధృవీకరించిన హై-వాల్యూ కేటగిరీల్లో లావాదేవీకి ₹1–₹2 లక్షలు (కేటగిరీ ఆధారంగా), తక్కువ రోజువారీ పరిమితి ప్రతి లావాదేవీకి ₹5 లక్షలు వరకు, రోజుకు గరిష్టంగా ₹10 లక్షలు P2P (పర్సన్-టు-పర్సన్), రోజుకు ₹1 లక్ష ఎటువంటి మార్పు లేదు .

పెంచిన ఈ రోజువారి పరిమితి ద్వారా భీమా ప్రీమియంలు, మూలధన మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్ హౌస్‌లు – ఇప్పుడు లావాదేవీకి ₹5 లక్షలు వరకు, రోజుకి ₹10 లక్షలు.

ప్రభుత్వ సేవలు / e-మార్కెట్‌ప్లేస్ (GeM), పన్ను చెల్లింపులు, Earnest Money Deposits (EMD) – ఇదే కొత్త పరిమితి వర్తిస్తుంది.ప్రయాణం – విమానాలు, హోటళ్లు మొదలైనవి – ఒక్క లావాదేవీ పరిమితి పెంచారు.

క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాలు / EMI చెల్లింపులు – మరింత పెంచగా నగల కొనుగోలు – ఒక్క లావాదేవీ పరిమితి పాత ₹1 లక్ష నుండి సుమారు ₹2 లక్షలకు పెంచారు. అయితే వ్యక్తుల మధ్య డబ్బు పంపడం రోజుకి ₹1 లక్షకే పరిమితం. పెరిగిన పరిమితులు కేవలం NPCI గుర్తించిన ధృవీకరించిన వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ లేదా ధృవీకరణ లేని వ్యాపారులకు పాత పరిమితులే వర్తిస్తాయి.

అమలు: అన్ని బ్యాంకులు మరియు UPI యాప్స్ సెప్టెంబర్ 15 నుండి కొత్త పరిమితులను తప్పనిసరిగా అమలు చేయాలి.

బ్యాంకు / యాప్ స్వతంత్రం: NPCI గరిష్ట పరిమితి నిర్ణయించినప్పటికీ, బ్యాంకులు లేదా యాప్స్ అంతర్గత రిస్క్ లేదా KYC ఆధారంగా మరింత తక్కువ పరిమితులను అమలు చేయవచ్చు.

- Advertisement -