ఆఫ్ లైన్‌లో యూపీఐ పేమెంట్?

75
upi
- Advertisement -

నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్‌ చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, లేదా ఇతర యూపీఐ ట్రాన్సాక్షన్ల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు.

అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఆగిపోయి సమస్య ఎదుర్కొంటున్న వారికి గుడ్ న్యూస్. దీనికి పరిష్కారంగా ఆఫ్ లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం *99# డయల్ చేయాలి. ఇందుకోసం బ్యాంకుతో రిజిష్టర్ అయి ఉన్న మొబైల్ నుంచి *99# డయల్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన భాషను ఎంచుకుని బ్యాంకు పేరు ఎంటర్ చేయాలి.

తర్వాత సంబంధిత బ్యాంకు డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలు ఎంటర్ చేసి..ఎక్స్‌పైరీ డేట్ కూడా ఎంటర్ చేయాలి. సక్సెస్ ఫుల్ గా సెట్ చేశాక ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నగదు బదిలీ చేసుకోవచ్చు. అయితే ఇలా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ. 0.50 ఛార్జ్ చేస్తారు.

- Advertisement -