UPI:బీమా ప్రీమియం చెల్లింపులపై కొత్త రూల్స్!

16
- Advertisement -

నేటి నుండి యూపీఐ పేమెంట్లలో కొత్త రూల్స్ వచ్చాయి. ప్రత్యేకించి బీమా ప్రీమియం చెల్లించే పాలసీదారులకు ఈ కొత్త యూపీఐ రూల్స్ వర్తిస్తాయి. ఇకపై యూపీఐ కస్టమర్లు బీమా ప్రీమియం చెల్లింపుల కోసం సరికొత్త ఫీచర్ బీమా ఏఎస్‌బీఏను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త విధానం ద్వారా పాలసీ జారీ అయ్యే వరకూ ప్రీమియం మొత్తం పాలసీదారుల అకౌంట్లలోనే బ్లాక్ చేసి ఉంటుంది. ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంటులో పడదు. బీమా కంపెనీ పాలసీ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అమౌంట్ మొత్తం బీమా కంపెనీ అకౌంట్లలోకి రిలీజ్ అవుతుంది. ఒకవేళ పాలసీ రిజెక్ట్ అయితే.. ఆ మొత్తం మీ అకౌంటులోకి రీఫండ్ అవుతుంది. ఈ కొత్త విధానం ద్వారా పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉండదు.

గూగుల్ పే, ఫోన్ పే యాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేసే పాలసీదారులు ముఖ్యంగా Bima-ASBA ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో సమర్పించాలి. దాంతో మీరు ఎంత అమౌంట్ బ్లాక్ చేయాల్సి ఉంటుందో కన్ఫార్మ్ చేయాలి. పాలసీ అప్రూవల్ వస్తేనే మీ బ్యాంకు అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది. పాలసీ తిరస్కరించినా లేదా రద్దు చేసినా ఎలాంటి కోతలు లేకుండా మొత్తం అమౌంట్ ఆలోమెటిక్‌గా రీ ఫండ్ అవుతుంది.

Also Read:ప్రధాని మోడీకి సీఎం రేవంత్ థ్యాంక్స్

- Advertisement -