ఆగస్టు 1 నుండి కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ మేరకు ప్రకటన చేసింది. యూపీఐ సిస్టమ్ గతంలో కన్నా వేగంగా సురక్షితంగా సర్వీసులను అందించడమే లక్ష్యంగా NPCI ఈ కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ఎందుకంటే ప్రతి నెలా 16 బిలియన్లకు వినియోగదారులు పేమెంట్లకు యూపీఐ వాడుతున్నారు. దీంతో యూపీఐ స్లో అయిందని, పేమెంట్లు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొంటుండటంతో ఈ మేరకు మార్పులను తీసుకొచ్చింది ఎన్‌పీసీఐ.
దీంతో ఇకపై యూపీఐ యూజర్లకు బ్యాలెన్స్ చెక్ చేయలన్నా లేదా ఆటోపే, రోజువారీ ట్రాన్సాక్షన్లపై పరిమితులు ఉంటాయి. యూపీఐ యాప్‌లలో రోజుకు 50 సార్లు మాత్రమే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. సిస్టమ్‌పై అదనపు భారాన్ని నివారించేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది.
మీ మొబైల్ నంబర్‌కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో కూడా మీరు ఒక రోజులో 25 సార్లు మాత్రమే చూడవచ్చు. Netflix, SIP మొదలైన ఆటో డెబిట్ పేమెంట్లు బిజీగా లేని సమయాల్లో మాత్రమే జరుగుతాయి. అలాగే ఉదయం 10 గంటల ముందు ఒకసారి, మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 గంటల తర్వాత ఈ ఆటో పేమెంట్లు పూర్తి అవుతాయి మీ పేమెంట్ ఆగిపోతే.. ఆ స్టేటస్ కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు. ప్రతి పేమెంట్ స్టేటస్ చెక్ మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.
Also Read:బీసీ రిజర్వేషన్లు..చిత్తశుద్ది నిరూపించుకోవాలి

