కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకు చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్‌తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.
తెలుగులో అత్యధిక థియేటర్లలో జూన్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 8న విశాఖపట్టణం సముద్రతీరంలో ఐ లవ్ యు ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన స్టార్ హీరోయిన్ డింపుల్ క్వీన్ రచిత రామ్ హీరోయిన్ గా నటిచింది. ఉపేంద్ర ఈ సినిమా కోసం మరింత ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తూ… నవ యువకుడిగా, యంగ్ ఎనర్జిటిక్‌గా కనిపించనున్నాడు. స్టైలింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర అద్భుతమైన పాటలకు డ్యాన్సులు ఇరగదీయడం విశేషం.
డైరెక్టర్ ఆర్. చంద్రు కథ, కథనం మీద నమ్మకంతో శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో భారీ ఖర్చుతో, గ్రాండియర్ విజువల్స్ తో, సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్‌తో అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా తెరకెక్కించారు. ఉపేంద్ర సినిమాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ కోరుకుంటారో అలాంటి అంశాలతో పాటు…. ఈసారి అదనంగా ఎవ్వరూహించని, లవ్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని జోడించారు. గతంలో ఉపేంద్ర నుంచి వచ్చిన సినిమాల కంటే పది రెట్లు ఎక్కువ ఎంటర్ టైన్ ఈ సినిమా నుంచి పొందుతారని చిత్ర దర్శక నిర్మాత ఆర్. చంద్రు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. అన్నట్టు ఇందులో బ్రహ్మానందం చేసిన కామెడీ మరో హైలైట్‌గా నిలవనుంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి మంచి కామెడీ సీన్స్ ఈ సినిమా ద్వారా రానున్నాయి.
ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఎలోటిక్, బోల్డ్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది. ఈ హాట్ సాంగ్ ఎవ్వరూహించని ప్రత్యేకమైన సందర్భంలో వచ్చే పాట కావడంతో ప్రేక్షకులు థ్రిల్‌కు గురవ్వడం ఖాయం. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఐ లవ్ యు ఫస్ట్ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది.