మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. స్వాతంత్ర సమరయోధుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిరు బర్త్ డే రోజున ఆగస్టు 22న సినిమా ప్రారంభం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే, చిరు మాత్రం ఒక స్వాతంత్ర సమరయోధుడి కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాను తన జన్మదినం రోజు కాకుండా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజైన ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి సూచించారట.
ఇక ఈ సినిమాలో చిరు నయా లుక్‌లో కనిపించనున్నారని టాక్. చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా ఒక హీరోయిన్గా నయనతార కన్ఫార్మ్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రను యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. మరి ఉపేంద్ర దీనికి ఒప్పుకున్నారో? లేదో? చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. 2015లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స్టయిలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీయబోతున్న ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం సౌత్‌లోనే జరుగనుందట. నిరవధికంగా షూటింగ్ జరిపి వచ్చే సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.