UI..ప్రేక్షకులకు ధన్యవాదాలు: ఉపేంద్ర

1
- Advertisement -

సూపర్ స్టార్ ఉపేంద్ర ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ ‘UI ది మూవీ’. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి ఘన విజయం సాధించి అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తెలుగు, కన్నడలో ఫస్ట్ డే కంటే సెకండ్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ పెరిగాయి. బుక్ మై షో లో 400K టికెట్స్ బుక్ అయ్యాయి. కన్నడ సినిమాలో ఈఏడాది వన్ అఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ మూవీగా UI నిలిచింది. తెలుగు కూడా బుకింగ్స్ అద్భుతంగా వున్నాయి.

సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ..నేను అరుదుగా డైరెక్షన్ చేస్తాను. ఇరవై ఏళ్ల క్రితం చేసిన ఏ, ఉపేంద్ర సినిమాలని మీరు ఇంకా గుర్తుపెట్టుకొని అభిమానించారు. అంతే అభిమానం ఇప్పుడు యూఐ సినిమాపై చూపించడం చాలా ఆనందంగా వుంది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఆడియన్స్ ఈ సినిమాకి స్టార్స్. మీపై నమ్మకం తో సినిమా చేశాను. మీ అందరికి కనెక్ట్ అవ్వడం ఆనందంగా వుంది. మీ ఆదరణ చూస్తుంటే రెగ్యులర్ గా నా డైరెక్షన్ లో సినిమాలు చేయాలనే ఉత్సాహం కలుగుతోంది. ఆడియన్స్ చాలా గొప్ప ఇన్వాల్ అయి సినిమా చూడటం చాలా థ్రిల్ ఇస్తోంది. తప్పకుండా అందరూ సినిమా చూడండి. ఇందులో రియల్ స్టార్స్ ఆడియన్సే’ అన్నారు.

సహా నిర్మాత నవీన్ మనోహరన్ మాట్లాడుతూ..ఉపేంద్ర గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆయన విజన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఐదు భారతీయ భాషల్లో సినిమాని రిలీజ్ చేశాం, అన్ని చోట్ల రెస్పాన్స్ అద్భుతంగా వుంది. తెలుగులో షోస్ అన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. డే బై డే షోస్, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. సినిమాని చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసిన గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు’ తెలిపారు.

Also Read:పీవీ…తెలంగాణ ఠీవి!

- Advertisement -