ప్చ్.. టాలీవుడ్‌ నెంబర్ 1 హీరో అతనట !

46
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ భారీ క్రేజ్‌ను తీసుకురాగా.. ‘పుష్ప-2’పై మరింత అంచనాలు పెంచింది. ప్రస్తుతం ‘పుష్ప2’ శరవేగంగా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో బన్నీకి సంబంధించిన రెమ్యునరేషన్ గురించి కొత్తగా నెట్టింట్లో క్రేజీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం బన్నీ ఏకంగా రూ. 125 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’ కోసం ఆయన రూ.120 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ ను వెనక్కి నెట్టి బన్నీ ఏకంగా రూ.125 కోట్ల పారితోషకం అందుకోవడం అంటే రికార్డే. అసలు రెమ్యునరేషన్ లో ప్రభాస్ ను వెనక్కి నెట్టే సౌత్ హీరో ఇప్పట్లో లేడు అంటూ ఇప్పటివరకూ ప్రచారం జరిగింది. కానీ, బన్నీ ఆ ఫీట్ ను చాలా ఈజీగా దాటేశాడు. అలాగే, బన్నీ తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.

బన్నీ పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయనున్నాడు. ఐతే, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా ?. ఏకంగా బన్నీ రూ.130 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ (రూ.120 కోట్లు)ను బన్నీ రెండు సార్లు దాటేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా టాలీవుడ్‌లో అల్లు అర్జునే నెంబర్ 1 హీరో అంటూ కొత్తగా ప్రచారం కూడా మొదలైంది.

ఇవి కూడా చదవండి…

పిక్ టాక్ : గ్లోబల్ బ్యూటీ అందాల గుమగుమలు !

మహేష్ తో ఆ హీరోయిన్ ఎవరు?

చిరు నెక్స్ట్ నిర్మాత ఆమెనా?

- Advertisement -