చరణ్ కోసమే ఫీలైందట !

198
Upasana worried about Ram charan
Upasana worried about Ram charan
- Advertisement -

‘ఖైదీ నెం 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు. తొలి రోజు రూ. 47 కోట్ల గ్రాస్ సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసి దటీజ్.. మెగాస్టార్ అనిపించాడు. మెగా అభిమానులు ఖైదీ సక్సెస్ సంబరాలను బాగానే ఎంజాయ్ చేశారు. మరీ మెగా ఫ్యామిలీ పరిస్థితి అప్పుడెలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లలేదు. ఇదే విషయంపై మెగా కోడలు ఉపాసన తనదైన స్టయిల్లో స్పందించింది.

మెగాస్టార్ ను చాలాకాలం తరువాత తెరపై చూసిన ఆ క్షణాల్ని మర్చిపోలేనని చెప్పింది. ఖైదీ నెం 150 సినిమాని కుటుంబమంతా కలిసి చూసినప్పుడు.. ఆనందం – ఉద్వేగం చూసి.. చివరకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయంది. చిరంజీవి రీఎంట్రీ అంటే.. ఉపాసన మాత్రం చిరు గురించి వర్రీ అవ్వలేదట.. చరణ్ గురించి ఫీలైందట. మామయ్య మాస్టర్ అని ఆయనకు ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసని.. అయితే తన భర్త చరణ్ మాత్రం చిన్న వయసులో అంత పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం చాలా రిస్క్ అండ్ టఫ్ అనిపించిందని చెప్పింది. ఒక ప్రక్కన తను హీరోగా ఒక సినిమా చేస్తూ మరోవైపు తండ్రి 150వ సినిమాను నిర్మించడం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పింది. అయితే ఔట్ పుట్ చూశాక.. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ చరణంటూ తెగ పొగిడేసింది.

మరోవైపు చాలా కాలంగా అభిమానులను ఊరిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా… కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ పుట్టిన రోజున సినిమా ప్రారంభించాలనుకున్నా, సరైన మూహూర్తం లేకపోవడంతో ముందే ప్రారంభించారు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -