హ్యాపీ బర్త్ డే..మిస్టర్ సి

232
upasana wishes Ram Charan
- Advertisement -

మెగాపవర్ స్టార్ రాంచరణ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి..చెర్రీకి ఒకరోజు ముందుగానే బర్త్ డే విషెస్‌తో పాటు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా రామ్‌చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన.

అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపింది ఉపాసన. హ్యాపీ బర్త్‌డే మిస్టర్‌ సి అని పూలతో నేలపై రాసి గ్రీట్ చేసింది. ఈ అక్షరాల ముందు నీలం జీన్స్‌ ప్యాంట్‌, తెల్ల చొక్కా, గోల్డ్‌ కలర్‌ వాచ్‌ ధరించిన ఓ వ్యక్తి నిలబడ్డారు. ఆయన చెప్పులపై ‘మిస్టర్‌ సి’ అని ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో, అమెరికాలోనూ ఒకేసారి రక్తదానం చేయడం అభినందనీయం, అనిర్వచనీయం…ఇంతకమించిన బర్త్ డే గిఫ్ట్‌ చరణ్‌కు ఏముంటుందని తెలిపింది. ఇక ప్రస్తుతం చెర్రీ నటించిన రంగస్థలం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేటైన ఈసినిమా టాలీవుడ్‌లో రికార్డులను తిరగరాయటం ఖాయం.

upasana wishes Ram Charan

- Advertisement -