పిల్లలు, ప్రెగ్నెన్సీపై ఉపాసన వ్యాఖ్యలు..!

94
- Advertisement -

ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు మెగా కోడ‌లు ఉపాస‌న‌. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు ఉపాస‌న‌. మా పెళ్లై పదేళ్లయింది… నా వివాహ బంధం చాలా ఆనందంగా ఉంది. కానీ కొంతమంది పిల్ల‌ల గురించి అడుగుతున్నార‌ని..త‌న‌కే కాదు చాలామంది పిల్ల‌ల‌కు ఇదే ఎదురవుతోంద‌ని తెలిపింది.

దీనికి సద్గురు మాట్లాడుతూ….రీప్రొడక్షన్‌ విషయానికొస్తే.. పిల్లలు కనకుండా ఉంటే నేను కచ్చితంగా అవార్డు ఇస్తా. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు కనకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు అని తెలిపారు. రాబోయే 30- 35 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరుకుంటుంది. దాని వల్ల ఎన్నో మార్పులు వస్తాయి. ఉండటానికి చోటు కూడా ఉండదని చెప్పారు.

దీనికి ఉపాస‌న స‌ర‌దాగా… మీకు మా అమ్మ, అత్తయ్య నుంచి కాల్‌ వస్తుంది అనగా సద్గురు.. నాకు రోజూ అలాంటి కాల్స్ వస్తాయి అని చెప్పి నవ్వేశారు.

- Advertisement -