రంగంలోకి సోనియా..కేసీఆర్, చంద్రబాబు, జగన్ లు ఢిల్లీకి రావాలని పిలుపు

363
Kcr Chandrababu Jagan Sonia
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23 రానుండటంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపుతుంది. సొంతంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి అటు బీజేపీకిగానీ, ఇటు కాంగ్రెస్ కు గానీ మెజార్టీ సీట్లు లేవు. కాబట్టి ప్రాంతియ పార్టీల మద్దతు కోసం ఆ రెండు పార్టీలు క్యూ కడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే బుబ్జగింపులు చేస్తుండగా…తాజాగా యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగారు. ఈసారి ఎలాగైనా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు.

తాజాగా యుపిఎ భాగస్వామ్య పక్షాలకు, ఎన్డీఎయేతర పార్టీలకు సోనియా లేఖలు రాశారు. మే23న ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ పార్టీల నేతలను ఆహ్వానిస్తూ ఆమె లేఖ రాశారు. ఫలితాల తర్వాత యుపిఎ భాగస్వామ్య పక్షాలు, ఎన్డిఎయేతర పక్షాలు ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు . ఒక వేళ ఎన్డీయేకు మెజార్టీ సీట్లు రాకపోతే ఏం చేయాలన్నదానిపై ఆరోజు ఆలోచించనున్నట్లు తెలుస్తుంది.

ఈసందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీల అధినేతలకు కూడా సోనియా లేఖ రాశారు. మే 23న మీటింగ్ హాజరుకావాలని కోరారు. మరి సోనియా ఆహ్వానం మేరకు కేసీఆర్, జగన్, చంద్రబాబు మే 23ను మీటింగ్ వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో కీలకంగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -