బీజేపి నేతకు ఝలక్‌ ఇచ్చిన మహిళా పోలీస్‌..

221
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లోని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు నడిరోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుండగా… ఓ మహిళా పోలీసు అధికారి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అధికార పార్టీ నేతలమన్న ధీమాతో సదరు నేతలంతా ఒంటరిగానే రోడ్డుపైకి వచ్చిన మహిళా పోలీసు అధికారిని భయకంపితులను చేసేందుకు యత్నించారు. ఆమెను రౌండప్ చేసి భయపెట్టేందుకు యత్నించారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాని ఆ లేడీ పోలీస్ బయపడకుండా… నడిరోడ్డుపై వారికి బద్ది చెప్పింది.

UP Police Woman Officer Stands Up Against Angry BJP Workers

అయితే అసలు విషయం ఏంటంటే…ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ లో సర్కిల్ ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్న పోలీసు అధికారిణి శ్రేష్ఠ ఠాకూర్. రోడ్డుపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే తిరుగుతున్న కొందరిని పట్టుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేస్తున్నందుకు వారికి జరిమానా విధించేందుకు ఆమె సిద్ధపడ్డారు. అయితే అధికార పార్టీకి చెందిన తమకే ఫైన్ వేస్తారా? అంటూ ఆ పార్టీ నేతలు ఎదురుతిరిగారు. ఆమెను రౌండప్ చేసి ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే ఈ అరుపులు కేకలకు ఏమాత్రం బెదరలేదు ఠాకూర్… ఎక్కువగా అరిస్తే మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తానని నవ్వుతూనే వారికి వార్నింగ్‌ ఇచ్చింది. అంతేకాదు.. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే రోడ్లపైకి వాహనాలు తీసుకుని రావచ్చంటూ మీ సీఎంను ఆదేశాలు ఇవ్వమనండి నేను మిమ్మల్నివదిలేస్తాను. వాహనాలను చెక్ చేసే అధికారం పోలీసులకు లేదని మీ సీఎం నుంచి రాయించుకుని రండి. అప్పుడు నేను వాహనాలను చెక్ చేయను. అనడంతో బీజేపీ నేతలు సైలెంట్‌ అయ్యారు.

నడి రాత్రిలో కూడా మా కుటుంబాలను వదిలి రోడ్లపైకి వస్తున్నది ఏదో తమాషా కోసం అనుకుంటున్నారా? మాకు అప్పగించిన విధులు నిర్వర్తించేందుకే వస్తున్నాం. మీ ప్రవర్తనతో మీ పార్టీకి మీరే చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే మిమ్మల్ని జనం బీజేపీ గూండాలు అంటారు. అంటూ ఠాకూర్ గుక్క తిప్పుకోకుండా వారికి క్లాస్ తీసుకుంది. అప్పటిదాకా చిందులు తొక్కిన బీజేపీ నేతలు గమ్మున అయిపోయారు. ఠాకూర్ రాసిన కేసుల మేరకు ఫైన్ కట్టేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

- Advertisement -