దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్‌డీటీవీ నిర్వహించిన సర్వేలో యూపీ, మణిపూర్, గోవాలో భాజపా కూటమి అధికారం చేజెక్కించుకొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
యూపీ..
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల్లో 403 స్థానాలకు గాను భాజపా కూటమి 185 స్థానాల్లో గెలుస్తుందని ఈ ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. కాగా, ఎస్పీ కూటమి 120 స్థానాలు, బీఎస్పీ 90, ఇతరులు ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా.
మణిపూర్..
మణిపూర్‌లో భాజపా 25 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. 17 నుంచి 23 స్థానాల్లో కాంగ్రెస్, 9- 15 స్థానాలను ఇతరులు గెలుచుకుంటారని తెలిపింది.
గోవా..
గోవాలో భాజపా కూటమి 15 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకొని మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి 12 నుంచి 18 స్థానాలు, ఆప్ 4 స్థానాలవరకూ, ఇతరులు 2 నుంచి 8 గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొంది.
ఇండియాటుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు..:
పంజాబ్‌లో (117 స్థానాలు)
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 71 స్థానాల్లో గెలుపొందుతుందని అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుందని, అకాళీదళ్- భాజపా కూటమి 4 -7 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇతరులు 0 నుంచి 2 స్థానాలు దక్కించుకొనే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
ఉత్తరాఖండ్ (70 స్థానాలు)
ఉత్తరాఖండ్‌లో భాజపా 46 నుంచి 53 సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్‌కు కేవలం 12 నుంచి 21 సీట్లు మాత్రమే దక్కుతాయని, బీఎస్పీ 1 నుంచి 2 స్థానాల్లో, ఇతరులు 1 నుంచి 4 స్థానాలను కైవసం చేసుకుంటారని అంచనా వేసింది.