- Advertisement -
ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలో భాజపా సత్తా చాటుతోంది. యూపీ ప్రజలు మోడీకే పట్టం కట్టనున్నట్లు తాజా ఎన్నికల్లో తెలిసిపోతోంది. అందరూ అనుకున్నట్టుగానే..ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో భాజపా ముందంజలో దూసుకుపోతోంది. 403 స్థానాలున్న యూపీలో ప్రస్తుతం భాజపా 350కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరోవైపు ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 80కి పైగా, బీఎస్పీ 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక ఇతరులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో భాజపా దూసుకుపోతోంది. రెండు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని సర్వేలు భాజపాకే పట్టం కట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అతిపెద్ద పార్టీ ఆవిర్భవించనుందని తేల్చిచెప్పాయి. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి.
- Advertisement -