కమలం సింబలే… నెంబర్‌ ప్లేట్‌..బీజేపీ నేత హల్‌చల్

392
bjp number plate
- Advertisement -

యుపీలో బీజేపీ సర్కార్‌ ఆగడాలకు అంతులేకండా పోతోంది. ప్రజలే కాదు వారికి రక్షణ కల్పిస్తున్న పోలీసులను సైతం లెక్కచేయడం లేదు కమలం నేతలు. ప్రజా ప్రతినిధుల దగ్గరి నుంచి కార్యకర్తల వరకు ఇష్టారితీన వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఓ బీజేపీ నేత తన వాహనానికి నెంబర్‌ ప్లేటు ఉండాల్సిన చోట బీజేపీ జెండా సింబల్ వేసుకుని ఏం చక్కా చక్కర్లు కొడుతున్నాడు. ఇదేంటి అని ప్రశ్నించిన పోలీసులకు తను చెప్పిన సమాధానం విని షాకయ్యారు పోలీసులు. మా రాష్ట్రం,మా దేశం అంటూ నానా హంగామా చేయడమే కాదు అధికార పార్టీ నాయకులనే ప్రశ్నించే దమ్ము ఉందా ఉందా నానా దుర్బాశలాడాడు. పోలీసులు చాలనా విధించగా చలానా కట్టనని మీ అంతూ చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల ఐపీఎస్‌ అధికారిణి చారూ నిగమ్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాధామోహన్‌ దాస్‌ పరుష పదజాలంతో దూషించారు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుని ఉన్నతాధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది.దీంతో పాటు బులంద్‌షహర్‌లోనూ ఓ మహిళా పోలీసు అధికారిని కొందరు బీజేపీ లీడర్లు చుట్టుముట్టి బెదిరించిన సంగతి తెలిసిందే. తమ పార్టీ కార్యకర్తల వాహనాలనే తనిఖీ చేస్తావా? అంటూ పోలీస్ అధికారి శ్రేష్ఠాఠాకూర్‌ను నిలదీశారు.అధికార నేతలను మందలించాల్సిన పోలీసులు చివరికి ఆమెనే బదిలీచేస్తూ తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తంగా యూపీలో బీజేపీ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -