Unstoppable With Suriya: బాలయ్యతో సూర్య

3
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ 4 ఇటీవలె ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు అతిథిగా రాగా రెండో ఎపిసోడ్‌కు ల‌క్కీభాస్క‌ర్ టీమ్ అలరించింది. ఇక తాజాగా మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. బాల‌య్య ఎప్ప‌టిలాగానే చాలా హుషారుగా క‌నిపించారు. సూర్య‌తో ప‌లు ఆట‌ల‌ను ఆడించారు. మొత్తంగా ప్రొమో ఆస‌క్తిక‌రంగా ఉంది. ఫుల్ ఎపిసోడ్ న‌వంబ‌ర్ 8 శుక్ర‌వారం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ మూడో ఎపిసోడ్‌కు త‌మిళ స్టార్ హీరో సూర్య అతిథిగా వ‌చ్చాడు. శివ దర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. దిశా పటానీ క‌థ‌నాయిక‌. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌వంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న‌ల్ లో భాగంగా సూర్యతో పాటు కంగువా టీమ్ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4లో సంద‌డి చేసింది.

Also Read:విజయవాడ – శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’

- Advertisement -