ముందు నా సినిమా చూడు..చెర్రీతో బాలయ్య!

64
- Advertisement -

బాలయ్య హోస్ట్‌గా ఆహాలో ప్రసారమవుతున్న షో అన్‌స్టాపబుల్ 2. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపిచంద్ ఇద్దరు ఈ షోకి రాగా ఫుల్ ఎపిసోడ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో ప్రొమో వైరల్‌గా మారగా తాజాగా మరో స్పెషల్ ప్రొమోని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టాక్ షో ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతుండగా తాజాగా ఎపిసోడ్-1కి సంబంధించిన ప్రోమోను ఎట్టకేలకు ఆహా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కట్ చేశారు.

నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి అంటూ బాలయ్య ప్రభాస్‌ను ర్యాగ్ చేయడం.. నేను కూడా నీ మాయలో పడిపోయాను అని బాలయ్య చెప్పారు. మరో హీరో గోపీచంద్‌తో 2008లో ఒక హీరోయిన్ విషయంలో మీ ఇద్దరు గొడవపడ్డారా అని బాలయ్య అడగ్గా, అది 2008 కాదనుకుంటా సార్ అని గోపీచంద్ బదులిచ్చాడు. ఇక ఎపిసోడ్‌లో భాగంగా, బాలయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఫోన్ చేసి, సంక్రాంతికి ముందుగా తన సినిమా చూడాలని.. ఆ తరువాతే చిరంజీవిగారి సినిమా చూడాలంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -