బాలయ్య..అన్‌స్టాపబుల్ 2 రెడీ!

43
NBK
- Advertisement -

బాలకృష్ణ హెస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమైన కార్యక్రమం…అన్‌స్టాపబుల్ విత్ NBk. తొలి సీజన్‌ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కాగా ఇక రెండో సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందించారు మేకర్స్‌. మధుర క్షణాలకి ముగింపు ఉండదు, కొనసాగింపే అంటూ వీడియో బైట్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కమింగ్ సూన్ అని పోస్ట్ చేశారు ఆహా టీం.

దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, పుష్ప టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు.

- Advertisement -