బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ వస్తున్నాడని తెలిసినప్పటి నుండి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఆసక్తి తగ్గట్టే ఆహా టీం లీకులు , ప్రోమో వీడియోలు వదులుతూ అంచనాలు పెంచేసింది. ప్రభాస్ తో ఒక ఎపిసోడ్ కాదని బాహుబలి ఫ్రాంచైజ్ లానే రెండు ఎపిసోడ్స్ వస్తాయని ఆహా ప్రకటించగానే అమ్మో ఈసారి మామూలుగా ఉండదని అందరూ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. ఇక తీరా ప్రభాస్ ఎపిసోడ్ వచ్చాక ఆహా అనిపించకుండా ఓహో ఇదేనా అనేలా షో ముందుకు నడిచింది. ఫస్ట్ ఎపిసోడ్ అయినా కాస్త ప్రభాస్ సినిమాలతో ఎంటర్టైన్ మెంట్ కొత్త విశేషాలు బయటికొచ్చాయి.
కానీ ‘బాహుబలి 2’ అంటూ వచ్చిన మరో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్ చేయలేకపోయింది. మొదటి ఎపిసోడ్ లో ప్రభాస్ కృతి సనన్ న్యూస్ మీదే సగం నడిచింది. ప్రభాస్ ఏమి లేదంటూ చెప్పాక కూడా బాలయ్య పదే పదే మేడమ్ ఎవరూ అంటూ బాగా నాంచాడు. దీంతో ఎపిసోడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ లో కూడా ప్రభాస్ ప్రేమ టాపిక్ తోనే సగం పైన ఎపిసోడ్ సాగింది. ప్రభాస్ -గోపీచంద్ ఫ్రెండ్ షిప్ గురించి ఇంకా బాలయ్య లోతుగా ఏవైనా అడిగి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగింది.”మీ నాన్న దర్శకుడు కదా నువ్వు డైరెక్ట్ చేస్తావా ? అందులో ప్రభాస్ హీరోగా ఉంటాడా ?” లాంటివి ఏమైనా గోపీచంద్ ని అడిగితే బాగుండేది. ముఖ్యంగా ప్రభాస్ ఇంకా చాలా అడగవచ్చు. మళ్ళీ మళ్ళీ షో కి రాడు కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఆహా సరిగ్గా వాడుకోలేకపోయింది. కృష్ణం రాజు గారి గురించి వచ్చే కన్వర్జేషన్ మాత్రం ఎమోషనల్ గా సాగింది.
ఫైనల్ గా బాహుబలి ఫ్రాంచైజ్ లాగే ప్రభాస్ ఎపిసోడ్స్ మంచి విజయం అందుకుంటాయనుకుంటే కాస్త చప్పగా ఇంకాస్త బోరింగ్ గా నడిచి ఆహా అనిపించలేదు. ఆహా టీం ఇంకా గ్రౌండ్ వర్క్ చేసి మంచి ప్లానింగ్ చేసుకొని ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి మిగతా అందరికీ మళ్ళీ మళ్ళీ చూసే షోగా మిగిలిపోయేది.
ఇవి కూడా చదవండి…