2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపని స్పష్టం చేసింది మమతా బెనర్జీ. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న మమతా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,శివసేనకు చెందిన సంజయ్ రౌత్,ఎంపీ కవిత,టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఫెడరల్ ఫ్రెంట్ ఆలోచనను వారితో పంచుకున్న మమతా బీజేపీతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలిపింది.
రాబోయే ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని తేల్చి చెప్పింది. తమిళనాడులో సైతం డీఎంకే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పిన మమతా…ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని సూచించింది. ప్రాంతీయ పార్టీల కూటమిలో ఎన్డీఏలోని పార్టీలు కూడా చేరుతాయని మమతాబెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.
పలు రాష్ర్టాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీలు గళం విప్పుతున్నాయని…బీజేపీకి వ్యతిరేకంగా లోక్‌సభతోపాటు ఆ యా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడోఫ్రంట్ ఉండాలని మమత చెప్పారు. విపక్షాలతో విస్తృతంగా చర్చించాకే ఒక నిర్ణయానికి వద్దామని మమత తెలిపింది.
సోనియాగాంధీ ఆరోగ్యం కుదుటపడ్డాక, తప్పకుండా ఆమెను కలుస్తానని మమత తెలిపింది. మమతతో భేటీ వివరాలను వెల్లడించడానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నిరాకరించారు.