- Advertisement -
సిట్ అంటే ఎందుకంత భయం అని ప్రశ్నించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు..సుప్రీం ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తారని భావించాం కానీ సిట్ లేదు గిట్ లేదని పలుచన చేయడం ఎంతవరకు సంస్కారం అని ప్రశ్నించారు.
విచారణలో వాస్తవాలు నిగ్గు తేలుతాయి…తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి. గతంలో 75 విమానాశ్రయాలు ఉండేవి, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 156 పెంచారు అన్నారు. త్వరలో నెల్లూరు, ఒంగోలు, పుట్టపర్తి లలో స్థలాన్ని పరిశీలించి నూతన ఎయిర్ పోర్ట్ లను శంకుస్థాపన చేస్తాం అని..ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు పనిచేస్తానని చెప్పారు.
Also Read:నాగార్జునపై క్రిమినల్ కేసు
- Advertisement -