ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పౌరసన్మానం చేస్తుంది. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినానంతరం తొలిసారి వెంకయ్య తెలంగాణ కు వస్తున్నందున సోమవారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది రాష్ట్రప్రభుత్వం.
ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనకు పౌరసన్మానం జరుగుతుంది. ఈ సన్మానసభకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.
ఈ సందర్భంగా బేగంపేట నుంచి రాజ్‌భవన్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. సోమవారం ఉదయం 10.45 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పౌరసన్మానం తర్వాత ఉపరాష్ట్రపతి రాజ్‌భవన్‌లోనే బసచేస్తారు. మంగళవారం ఉదయం ఏడు గంటలకు తిరుగి ఢిల్లీకి వెళ్తారు. సీఎం కేసీఆర్ కోరిక మేరకు ఏర్పాటు చేస్తున్న ఈ సన్మానసభకు గవర్నర్ నరసింహన్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు.