కేంద్రమంత్రి అనంతకుమార్ కన్నుమూత..

290
Union Minister Ananth Kumar dead
- Advertisement -

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి అనంతకుమార్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. అనంతకుమార్‌ గొప్ప నేత అని.. ప్రజాసేవ చేయడానికి యుక్తవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. అనంతకుమార్‌ మృతిపట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు.

1959 జులై 22న బెంగళూరులో జన్మించిన ఆయన 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అప్పటినుండి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుస్తువచ్చినా 2014లో మోడీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  Union Minister Ananth Kumar deadకొద్దిరోజుల క్రితం ఆయన అమెరికాలో చికిత్స పొందారు. న్యూయార్క్‌లోకి క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొంది గత నెల బెంగళూరు వచ్చారు. అనంతరం శ్రీశంకర ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు.

- Advertisement -