మొత్తం ధాన్యం సేకరణ చేయలేం: కేంద్రం

229
piyush goel
- Advertisement -

ధాన్యం కొనుగోలు సేకరణపై కేంద్రం లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాద‌ని తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి పీయూష్‌… ఎఫ్‌సీఐతో చర్చించి ప్రణాళిక ప్ర‌కారం ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్ప‌ష్టం చేసింది.

ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయ‌ని …. క‌నీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్‌లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితుల‌ ఆధారంగానే సేకరణ జరుగుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్‌సీఐ.. గోధుమ, వరి ధాన్యాలను నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తాయి. సేకరించిన ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు.

- Advertisement -