- Advertisement -
రోజురోజుకు పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏటా మే నెలలో ఎండల తీవ్రత ఉండగా, ఈసారి మార్చి నుంచే సెగ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పలు కీలక సూచనలు చేసింది.
రోజులో కావాల్సినన్ని నీళ్లు తాగాలని…అవసరమైతే ఓఆర్ఎస్ వంటి డ్రింక్స్ కూడా తీసుకోవాలన్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలని…వదులుగా ఉండే కాటన్ దుస్తులే ధరించాలన్నారు.
ఎండ నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండను భరించలేని వాళ్లు, పిల్లలు, గర్భిణులు, శిశువులు, మానసిక సమస్యలు ఉన్నవాళ్లు, ఎండలో, బయట పనిచేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని. ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.
- Advertisement -