నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలలను కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం వాస్తవరూపంలోకి తెచ్చి సూపిస్తోంది.
ఇప్పటికే నిధుల సమస్యలను పరిష్కరించగా.. నీళ్ల కోసం అపరభగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియామకాల్లో భాగంగా స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పించేదిశగా నూతన జోనల్ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న కేసీఆర్ ఆశయం నెరవేరింది. తాజాగా తెలంగాణ నూతన జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లకు అంగీకారం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దాంతో త్వరలోనే కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ వెలువరిచనుంది. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కాగా..కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.
..