కరోనా సెకండ్ వేవ్..ఆ రాష్ట్రాల్లోనే: కేంద్రం

224
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా కరోనా సెకండ్ వేవ్ అందరిని కలవర పెడుతోంది. గత 24 గంట‌ల్లో దేశంలో 53,480 మందికి క‌రోనా పాజిటివ్ రాగా ఇప్పటివరకు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.

ఇక కరోనా సెకండ్ వేవ్ కేవలం కేవ‌లం ఎనిమిది రాష్ట్రాల నుంచే న‌మోద‌వుతున్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం కొత్త కేసుల‌లో మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు చెందిన‌వారే 85 శాతం మంది ఉన్నార‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 27,918 మందికి క‌రోనా సోకిన‌ట్లు వెల్ల‌డించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు మాస్క్ లేకుండా బయటకు రావొద్దని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.

- Advertisement -