పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు

330
pv-sindhu-
- Advertisement -

71 గణతంత్రదినోత్సవం సందర్బంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏడుగురికి ‘పద్మ విభూషణ్’, 16 మందికి ‘పద్మ భూషణ్’, 118 మందికి ‘పద్మశ్రీ’ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయనున్నారు. క్రీడా రంగంలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న పీవీ సింధు ప్రతిభకు గుర్తింపుగా పద్మభూషణ్’ ప్రకటించింది.

కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఐదుగురు తెలుగువాళ్లకు పురస్కారం లభించింది. . శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం), చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)లకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ఏపీ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం), దళవాయి చలపతిరావు (కళారంగం)లను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.

మాజీ కేంద్ర మంత్రులు దివంగత అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్, జార్జి ఫెర్నాండెజ్ లకు ప్రజా వ్యవహారాల విభాగంలో ‘పద్మవిభూషణ్’ ప్రకటించారు. ఇదే విభాగంలో మారిషస్ మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్, భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ లకు కూడా ‘పద్మ విభూషణ్’ అందించనున్నారు. ఇక, ‘పద్మభూషణ్’ అవార్డుల విషయానికొస్తే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను విశిష్ట గౌరవం వరించింది. వినోద రంగం నుంచి కంగన రనౌత్, ఏక్తా కపూర్ లను ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపిక చేశారు.

- Advertisement -