3న కేంద్ర కేబినెట్ విస్తరణ…

232
Union cabinet reshuffle on 3rd sep
- Advertisement -

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఎల్లుండి ఆదివారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.  మార్పు చేర్పులపై ఇప్పటికే అమిత్ షా, మోడీ కసరత్తు ప్రారంభించగా  కొత్తగా కేబినెట్‌లో చేరేవారిపై ఉహాగానాలు జోరందుకున్నాయి. కొత్తగా కేబినెట్లో అన్నాడీఎంకే, జేడీయూకి ఛాన్స్  లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జేడీయూ,అన్నాడీఎంకే నుంచి  ఇద్దరికి చోటు లభించనున్నట్లు సమాచారం.

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాలకు కేబినెట్‌ బెర్త్ లభించే అవకాశం ఉంది. రాజీనామాపై పలువురు కేంద్రమంత్రులు  స్పందించారు. మహేంద్రనాథ్ పాండే, రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజీవ్ బల్యాన్ ఫగన్ సింగ్ కులస్తే రాజీనామా చేశారు. ఉమాభారతి రాజీనామాపై కూడా పలు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా త‌న నిర్ణ‌యం కాదు అని, అది పార్టీ నిర్ణ‌య‌మ‌ని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ ప్ర‌తాప్ రూడీ తెలిపారు.

మ‌రోవైపు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఉమాభార‌తి ఖండించారు. అస‌లు ఆ అంశం త‌న దృష్టికే రాలేదు అన్న‌ట్లు ఆమె చెప్పారు. రాజీనామా అంశంపై తానేమీ మాట్లాడ‌లేన‌న్నారు.

పలువురు మంత్రుల శాఖలు కూడా మార్చనున్నారు.ప్రస్తుతం ఆర్థిక, రక్షణ శాఖలు అరుణ్ జైట్లీ ఒక్కరే చూస్తుండటంతో, ఆయనపై కొంత భారాన్ని తొలగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి మిగతా రవాణా వ్యవస్థల బాధ్యతలనూ అప్పగించనున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు రక్షణ శాఖను అప్పగించి, జనతాదళ్ నుంచి తీసుకునే ఎంపీకి రైల్వే శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -