Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్

32
- Advertisement -

2024-25 సంవత్సరానికి గాను కేంద్రబడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డు నెలకొల్పారు. ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఇక ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తామన్నారు.

()మరో ఐదేళ్ల పాటు 80కోట్ల మందికి ఉచిత రేషన్
()బడ్జెట్ లో యువతకు రూ. 2లక్షల కోట్లు కేటాయింపు.
() అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క రోడ్ మ్యాప్.
()ఇంధన భద్రతపై ప్రభుత్వం దృష్టి.
()ఉపాధి పెంపుపై దృష్టి సారించాం
()వ్యవసాయ రంగం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత.
()పేదరికం, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి
()యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి
()నాలుగు కోట్ల ఉద్యోగ కల్పనకు ప్రధాన మంత్రి ప్రత్యేక నిధి
()ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1కి పరిమితమైంది
()మధ్యంతర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగింపు
()4 కోట్ల మందికి స్కిల్ పాలసీ
()400 జిల్లాల్లో వ్యవసాయం డిజిటలైజేషన్

Also Read:ఈసారి కూడా ‘పేపర్ లెస్’ బడ్జెట్

()అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు.
()బీహార్‌లో రోడ్లు, ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.
()బీహార్ లో రూ.21 వేల కోట్లతో పవర్ ప్లాంట్
()బీహార్‌లో 3 ఎక్స్‌ప్రెస్‌వేలు
()బుద్ధగయ-వైశాలి ఎక్స్‌ప్రెస్‌వే
()పాట్నా-పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం
()బక్సర్‌లోని గంగా నదిపై రెండు లైన్ల వంతెన
()బడ్జెట్‌లో బీహార్‌లో పర్యాటక రంగానికి పెద్దపీట
()నలందలో పర్యాటక అభివృద్ధి
()బీహార్‌లో రాజ్‌గిర్ టూరిస్ట్ సెంటర్ నిర్మాణం
()వరద విపత్తుపై బీహార్‌కు రూ.11000 కోట్లు అందించడం

()పట్టణాభివృద్ధి శాఖపై స్పెషల్ ఫోకస్
()అసోంలో వరదల నివారణకు కేంద్రసాయం
()రుణవసూళ్లకు ప్రత్యేక ట్రైబ్యునళ్లు
()స్టాంప్ డ్యూటీ పెంపునకు రాష్ట్రాలకు అనుమతి
()ముద్రాలోన్లు రూ.20లక్షలకు పెంపు
()ఈశాన్య రాష్ట్రాలకు పూర్వోదయ స్కీం
()గ్యారంటీ, థర్డ్ పార్టీ లేకుండా MSME రుణాలు
()మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
()కూరగాయల ఉత్పత్తికి మెగా క్లస్టర్లు
()కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్
()ఈశాన్య రాష్ట్రాల్లో 100కి పైగా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు
()కార్మికులకు డోర్మెంటరీ తరహా అద్దె ఇళ్లు
()కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్
()చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం

()ప్లాస్టిక్‌పై కస్టం డ్యూటీ పెంపు
()వచ్చే ఐదేండ్లలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
()కాశీ తరహాలో గయా అభివృద్ధి
()మహిళల అభివృద్ధికి 3 లక్షల కోట్లు
()నగరాలకు అనుబంధంగా హరిత నగరాలు
()మేడిన్ ఇండియాపై స్పెషల్ ఫోకస్
()3 రకాల క్యాన్సర్ మందులపై కస్టం డ్యూటీ తగ్గింపు
()లెదర్ ఉత్పత్తులపై కస్టం డ్యూటీ తగ్గింపు
()ఎయిర్‌పోర్టులు, మెడికల్ కాలేజీలకు అనుమతులు

- Advertisement -