నేడు కేంద్ర బడ్జెట్‌.. సర్వత్ర ఆసక్తి..

179
Union Budget 2021-22
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఉదయం 11 గంటలకు కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 2021-22 ఆర్థిక సమావేశానికి సంబంధించిన బడ్జెట్ కు మరికాసేపట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ ప్రతులతో కలిసి క్యాబినెట్ సమావేశానికి బయలుదేరారు. మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న క్యాబినెట్ ఈ బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. ఆపై ఉదయం 11 గంటల సమయంలో పార్లమెంట్ ముందుకు రానుంది.

కాగా, గత సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే, వాస్తవ కేటాయింపులు సమూలంగా మారిపోయాయన్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ కారణంగా, బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రంగాలకు జరగలేదు. లాక్ డౌన్ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశాయి. నిధులను దారి మళ్లిస్తూ, ఎప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. ఈ సంవత్సరం వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్న ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగానికి భారీగానే కేటాయింపులు జరుపునున్నారు.సుమారు 30 అంశాలపై నిర్మల తన బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉన్నదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

- Advertisement -