తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన ముద్ర వేశారు. బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్తి చెప్తూ పట్టు వస్త్రంలో బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. పట్టు వస్త్రానికి రాజముద్ర వేసి.. బడ్జెట్ ప్రసంగ కాపీని పార్లమెంటుకు తీసుకొచ్చారు. చైనా, అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన నిర్మలా పది లక్ష్యాలను ఎంచుకుని ముందుకుసాగుతున్నామని చెప్పారు. సంపదను సృష్టించడంలో మేకిన్ ఇండియా ప్రధాన పాత్ర పోషించిందన్నారు. గత ఐదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలను ఆమె ప్రస్తావించారు.
నిర్మలా బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్…
()()మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు
()రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ
()వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు
() రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
()పన్నుల విధానంలో పారదర్శకత.. కార్పొరేట్ ట్యాక్స్ పరిధి రూ.400కోట్లకు పెంపు
()బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు
()5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు
()ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78శాతం పెరిగాయి..2018లో పన్ను వసూళ్లు రూ.11.37లక్షల కోట్లు
()బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి
() రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్
() పాన్ నంబర్ లేకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం… పాన్ లేదా ఆధార్ నంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలుకు వెసులుబాటు
()విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గింపు
()దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
()రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం
()రానున్న ఐదేళ్లలో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.100 లక్షల కోట్లు
()ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం
() 17 పర్యాటక కేంద్రాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాల ఏర్పాటు
()ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్ చేయనున్నాం
()భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు
()భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు
()ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ
()ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ
()256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్
()స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్
()నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు
()బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం
()ఖేల్ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం.
() స్టడీ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే అవకాశం
()పరిశోధనలకు ప్రాధాన్యం….జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం
()జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు
() పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.
()మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
()అక్టోబరు 2నాటికి ఓడీఎఫ్ భారత్‌గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం
()81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద నిర్మించాం
()డిజిటల్ అంతరాలను తొలగించే డిజిటల్ లిటరసీ కార్యక్రమం
()9.6కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మాణం
()జలశక్తి మంత్రిత్వశాఖ ఏర్పాటు
()హర్ ఘర్ జల్ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
()జీరో బడ్జెట్ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం)
()1.25 లక్షల కి.మీ. మేర రహదారుల ఆధునికీకరణ
()2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్, గ్యాస్ సరఫరా
() 1.9కోట్ల ఇళ్ల నిర్మాణం
()మీడియా, యానిమేషన్, విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలన
()ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ
()స్టాక్‌మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు వెసులుబాటు
()విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం. రెడ్ టేపిజం నియంత్రణకు చర్యలు
()ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ కోసం ప్రత్యేక లాబీయింగ్.
()చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్ పథకం
()ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్ యోజన
()బస్ ఛార్జీలు, పార్కింగ్ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన
()మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నన్స్
()పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం
()ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం
()భారతమాల, సాగర్‌మాల, ఉడాన్ పథకాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి
()ఆదర్శ అద్దె విధానం…ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తాం
()ఒకే దేశం.. ఒకే గ్రిడ్ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా
()రైల్వేల్లో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నాం.
() జలమార్గంలో రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
()లక్షా25వేల కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తాం
()పర్యావరణహితంగా 30 వేల కిలోమీటరల రహదారిని మార్చుతాం
()దేశవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందిస్తాం
()దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో జలశక్తి అభియాన్ పథకం అమలు చేస్తాం
()2020లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి తారునీరు అందిస్తాం
()ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం కల్పిస్తాం
()ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా సాగుతున్నాం
()ఉపాధి, ఉద్యోగ కల్పన కీలకం
()మేకిన్ ఇండియాను మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
()దేశంలో 657 కి.మీ. మేర నడుస్తున్న మెట్రో రైళ్లు
()ఉడాన్ స్కీమ్‌తో చిన్న నగరాలకు విమాన సర్వీసులు
()విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి
()ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10వేల కోట్లు