ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేస్తామని …ఉపాధిహామీ పథకంలో మహిళలకు ప్రాతినిథ్యం పెరిగేలా చూస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. కనీసం 100 రోజుల ఉపాధి కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తామన్నారు.
ఐసీటీ ద్వారా విద్యాబోధన. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
ప్రతిభ కలిగిన కళాశాలల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన
2018కల్లా గ్రామీణ విద్యుద్దీకరణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం.
ప్రధాన మంత్రి పజల్ యోజన కింద రోడ్లు, 133 కి.మీ. ప్రతి రోజూ నిర్మించనున్నాం.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం
ఉపాధిహామీ పథకంలో మహిళలకు ప్రాతినిథ్యం పెంపు
కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు
100 రోజుల కనీస ఉపాధిహామీ.
సెకండరీ విద్యలో ఆవిష్కరణలకు ప్రత్యేకనిధి.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.48వేల కోట్ల కేటాయింపు.
ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా.
గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది.
పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన.
రైతులకు రూ.10లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాలన్న లక్ష్యం.
రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.
రైతుల సంక్షేమ, గ్రామీణ ఉపాధి, యువత, మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ సుపరిపాలన, విత్త విధానం, పన్ను సంస్కరణలు, నిజాయితీ పనులకు పెద్దపీట.