దీపావళి పండుగ సంధర్బంగా ‘వెరీ వెరీ అన్ హ్యాపీ దీపావళి’ అంటూ.. తనకు మాత్రం ప్రతి రోజు దీవాళినే అంటూ ట్వీట్ చేశారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రతీ పండుగకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపే రాంగోపాల్ వర్మ దీపావళి పండుగను కూడా వదిలి పెట్టలేదు. అందరికీ అన్ హ్యాపీ దీవాళి అంటూ మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ‘
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండి, తనదైన శైలిలో విమర్శలు చేస్తుండే వర్మ… పటాకులు పేల్చడం వల్ల జింక్, సోడియం వంటి విష వాయువులు గాల్లోకి వదులుతున్న వారందరికీ అన్ హ్యాపీ దీపావళి అని ట్వీట్ చేశాడు. టపాకాయలు కాలుస్తూ భారీ శబ్దాలను సృష్టించడంతో పాటు వయోవృద్ధులను, చిన్నారులను ఇబ్బంది పెడుతున్న వారికి అన్ హ్యాపీ దీపావళి అన్నాడు. ఆస్థమా వంటి వ్యాధులతో బాధపడేవారి సమస్యలను మరింతగా పెంచే వారికి, శబ్దాలు, కాంతులతో పక్షులను కష్టపెట్టేవారికి, నరకాసురుడి గురించి తెలియకుండా, అతని చావును సెలబ్రేట్ చేసుకునే వారికి అన్ హ్యాపీ దీపావళి అంటూనే… ఈ రోజు దీవాళిని సెలెబ్రేట్ చేసుకోని వారందరికీ హ్యాపీ దీవాళి. నాకు మాత్రం ప్రతి రోజు దీవాళినే’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ.