గత కొంతకాలంగా సరైన హిట్టు లేని హీరో సునీల్ …. ఆలోటును తీర్చేందుకు ఆపసోపాలు పడిపోతున్నాడు. కమెడియన్‌గా హ్యాపీగా నడిచిపోయిన సునీల్ కెరీర్.. హీరోగా మాత్రం కుదుపుల మయంగా సాగుతోంది. తఢాకా తరవాత.. సునీల్ హిట్టు మొహమే చూళ్లేదు. ఇప్పుడు సునీల్ ఆశలన్నీ ‘ఉంగరాల రాంబాబు’పైనే. ఫీల్ గుడ్ సినిమాలు తీసిన క్రాంతిమాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే… షూటింగ్ దశలోనే చాలా కాలం ఉండిపోవడం, సినిమా పూర్తయినా విడుదలకు టైమ్ తీసుకోవడంతో ఆ హైపూ… తగ్గుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు.
మియా జార్జ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఇటీవలే ‘హూలాలా హూలాలా… భూగోళం ఊగేలా…’ అనే పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు సినిమా ట్రైలర్ వచ్చేసింది.
కమర్షియల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ బుధవారం సాయంత్రం ‘ఉంగరాల రాంబాబు’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ కలర్‌ఫుల్‌గా, సునీల్ కామెడీ టైమింగ్‌తో అదరిపోయింది. దీనికి తోడు ప్రకాష్ రాజ్, పోసాని వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. ‘ఉంగరాల రాంబాబు’ క్యారెక్టర్‌లో సునీల్ ఇరగదీసినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమైపోతుంది. కొంతకాలంగా బ్రేక్ కోసం ఎదరుచూస్తున్న సునీల్‌కి ఈ సినిమా మంచి హిట్టు ఇవ్వాలని కోరుకుందాం.